బడంగ్పేట్, నవంబర్ 6 : ఎస్సీవర్గీకరణ అమలు చేయకపోతే రేవంత్ సర్కార్‌పై యుద్ధం చేస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా మాదిగల ధర్మయుద్ధ మహాసభను తుక్కుగూడలోని కళాశ్రీ గార్డెన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణమాదిగ మాట్లాడుతూ డిసెంబర్ 21న హైదరాబాద్‌లో ధర్మయుద్ధం మహాప్రదర్శన చేపట్టి రేవంత్‌రెడ్డితో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు.