దుండిగల్, మే 24: ఉద్యోగ అవకాశాలు.. పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాల శిక్షణలో మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల మరోసారి తన విజయకేతనాన్ని ఎగురవేసింది. 2026 ప్లేస్మెంట్ సీజన్లో అద్భుతమైన ఫలితాలు సాధించి, తెలంగాణలోనే అగ్రగామి ఇంజినీరింగ్ కళాశాలగా ప్రత్యేకత చాటుకున్నది. క్యాంపస్ డ్రైవ్‌లో భాగంగా 36కుపైగా ప్రతిష్టాత్మక మల్టినేషనల్ కంపెనీలు పాల్గొన్నాయి. మొత్తం 621కుపైగా ఉద్యోగ నియామక పత్రాలను ఎంఎల్ఆర్ఐటీ విద్యార్థులు కైవసం చేసుకున్నారు.
ఈ సీజన్లో ఒక విద్యార్థి ఏకంగా రూ.51 లక్షల అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీ సాధించి రికార్డు సృష్టించాడు. మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్ఎల్టెక్, విర్టూసా, డెలాయిట్ వంటి దిగ్గజ సంస్థలు కాలేజీ విద్యార్థుల ప్రతిభపై నమ్మకంతో భారీ సంఖ్యలో నియామకాలు చేపట్టాయి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ, ఎంఎల్)డాటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, కోర్ ఇంజినీరింగ్, ఫిన్‌టెక్ రంగాల్లో విద్యార్థులు ఉన్నత అవకాశాలు దక్కించుకున్నారు.

క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరచడం గర్వకారణం. విద్యార్థులను అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలతో తీర్చిదిద్దడమే మా విద్యాసంస్థల ప్రధాన లక్ష్యం. లక్ష్యసాధనలో విద్యార్థులు ముందంజలో ఉండాలి. ఈ రికార్డు స్థాయి విజయానికి కారకులైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి, ప్లేస్మెంట్ టీమ్‌కు అభినందనలు. బీటెక్ అనంతరం ప్లేస్మెంట్లు పొందాలనుకునే విద్యార్థులకు తమ ఎంఎల్ఆర్ఐటీ కళాశాల రైట్చాయిస్గా మారడం సంతోషంగా ఉంది.
– మర్రి రాజశేఖర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే, కళాశాల ఫౌండర్ సెక్రటరీ

దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ఐటీ కళాశాలలో సీఎస్ఎం చదువుతుండగానే నాకు ఓ ప్రముఖ కంపెనీలో రూ.10లక్షల వార్షిక వేతనంతో ప్లేస్మెంట్ రావడం గర్వంగా ఉంది. కళాశాల యాజమాన్యానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎంఎల్ఆర్ఐటీ కళాశాలలో విద్యార్థులకు అందజేస్తున్న వసతులు, మెరుగైన విద్యాబోధన, స్కిల్ డెవలప్మెంట్ వంటి శిక్షణ కార్యక్రమాలతోనే తమకు గుర్తింపు దక్కుతున్నది. దీంతోనే ఉద్యోగావకాశాలు వస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
– సాయిరాజ్ వడేగార్, రూ.10లక్షల వార్షిక వేతనం పొందిన విద్యార్థి