హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రం లో ఇటీవల శాసనమండలిలో ఖాళీ అయిన 8మంది ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్త సభ్యులు ఎన్నికయ్యారు. వీరి లో ఎమ్మెల్యే కోటాలో ఐదుగురు, ఉపాధ్యాయ కోటాలో ఇద్దరు, గ్రాడ్యుయేట్ కోటాలో ఒకరు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. సోమవా రం ఉదయం మండలి ఆవరణలో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే కోటా కాంగ్రెస్ సభ్యులు అద్దంకి దయాకర్, విజయశాంతి, కేతావత్ శంకర్‌నాయక్, సీపీఐ సభ్యుడు నెల్లికంటి సత్యం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కొమురయ్య, శ్రీపాల్‌రెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీఆర్ఎస్ సభ్యుడు దాసోజు శ్రవణ్ మరోరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు మండలి అధికారులు వెల్లడించారు.