సత్తుపల్లిటౌన్, డిసెంబర్ 31: ఊరూరా కాంగ్రెస్ నేతల దౌర్జన్యానికి అడ్డూఅదుపూ లేకుండా పోయిందనడానికి ఇదే ఓ నిదర్శనం. పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకానికి పాల్పడుతున్నారనడానికి ఈ ఘటనే ప్రత్యక్షసాక్ష్యం. కాంగ్రెస్ నాయకుడి దౌర్జన్యానికి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామం డాబా బజార్‌కు చెందిన రైతు కన్మతరెడ్డి శ్రీనివాసరెడ్డి సోమవారం ఆత్మహత్యకు యత్నించాడు. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయన ఖమ్మంలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు కాంగ్రెస్ నాయకుడు సుబ్బారెడ్డి కక్షసాధింపు చర్యలే కారణమని బాధితుడు, స్థానికులు ఆరోపిస్తున్నారు. రేజర్ల గ్రామంలోని డాబాబజార్లో శ్రీనివాసరెడ్డి ఇంటి స్థలంలో ఆరు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత సుబ్బారెడ్డి అధికారుల తో సీసీ రోడ్డు వేయించేందుకు పంచాయతీ నిధులతో గ్రావెల్ తోలించారు. తన సొంత స్థలంలో రోడ్డు ఎలా వేస్తారంటూ శ్రీనివాసరెడ్డి అడ్డుకున్నా వినకపోవడంతో.. సత్తుపల్లి కోర్టును ఆశ్రయించారు.
కాంగ్రెస్ నేత సుబ్బారెడ్డి మరింత కక్ష పెంచుకొని తనకున్న పలుకుబడితో సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో శ్రీనివాసరెడ్డిపై తప్పుడు ఫిర్యా దు చేయించాడు. దీంతో పోలీసులు శ్రీనివాసరెడ్డిని, అతడి భార్య, కుమారుడిని స్టేషన్‌కు పిలిపించారు. తమ స్థలంలో సీసీ రోడ్డు నిర్మించేలా వారి ని బలవంతంగా ఒప్పించేయత్నం చే శారు. సోమవారం ఉదయం పోలీస్ బందోబస్తుతో సుబ్బారెడ్డి ఆ స్థలంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టించాడు. దీంతో మనోవేదనతో పు రుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు గమనించి అ తడిని సత్తుపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి ఆందోళనకరం గా మారడంతో ఖమ్మం దవాఖానకు తరలించారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: మధు, సండ్ర
ఖమ్మం, డిసెంబర్ 31: రేజర్ల గ్రామంలో రైతు కన్మతరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నానికి బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూడాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం సీపీ సునీల్‌దత్‌ను మంగళవారం కలిసి వినతిపత్రం అం దజేశారు. రైతు శ్రీనివాసరెడ్డిని వారు పరామర్శించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సత్తుపల్లి సీఐ కిరణ్‌పై విచార ణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కక్షా రాజకీయాలు కొనసాగుతున్నాయని, బాధిత కుటుంబానికి బీఆర్ఎ స్ అండగా ఉంటుందని తెలిపారు.