మహబూబాబాద్ రూరల్, అక్టోబర్ 25 : రైతు భరోసాను ఎగ్గొట్టిన గొప్ప పార్టీ కాంగ్రెస్ అని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. శుక్రవారం మహబూబాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు రైతుబంధు ఇవ్వగా.. ఎన్నికల సమయంలో ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేశాడని అన్నారు.
ఖరీప్ సీజన్లో పంట పొలాలు కోత దశకు వచ్చినా ఇంత వరకు రైతుభరోసా ఇవ్వలేదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించలేదని విమర్శించారు. అకాల వర్షంతో జిల్లా అతలాకుతలమైతే ప్రభుత్వం బాధితులను ఆదుకోలేదని అన్నారు. హైడ్రా పేరుతో నిరుపేదలను భయభ్రాంతులకు గురిచేస్తున్నదని ఆరోపించారు.