ఖమ్మం సిటీ, జూన్ 20 : ‘పంటలు కొనే దిక్కు లేదు.. మద్దతు ధర ఊసే లేదు.. రైతుబంధు కొందరికే.. రైతు రుణమాఫీ సగం సగం.. రైతుబీమా ప్రీమియం గురించి పట్టింపు లేదు.. కాంగ్రెస్ అడ్డగోలు పాలనలో తెలంగాణ అన్నదాతలు ఆగం అవుతున్నరు’ అని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు.
ఇందిరమ్మ రాజ్యంలో తె లంగాణ ద్రోహి, ఉద్యమకారుల మీదకు తు పాకీ ఎక్కుపెట్టిన రేవంత్ ఇక్కడి ప్రజలను, రైతాంగాన్ని మళ్లీ సమైక్య రాష్ట్రంలోకి తీసుకెళ్తున్నాడని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు వరంగల్‌లో సభ ఏర్పా టు చేసి రైతు డిక్లరేషన్‌లో ప్రకటించిన హామీలను ఎందుకు అమలు చేయడంలేదని ప్ర శ్నించారు. రైతుబంధు కింద ఎకరాకు 15 వేలు ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక రూ.12 వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించి యావత్ రైతాంగాన్ని మోసం చేశారని ధ్వజమెత్తారు.
‘సర్’పై గులాబీ శ్రేణులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 24న సత్తుపల్లి పట్టణానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని, ముఖ్యనేతలు, నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు హాజరై విజయవం తం చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని బుగ్గపాడు ఫుడ్‌పార్క్ భూములను కాంగ్రెస్ పెద్దలు ఓ కార్పొరేట్ కంపెనీకి కారు చౌకగా కట్టబెట్టడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు.