ప్రజలకు పరాభవాన్ని మిగిల్చిన బడ్జెట్
పరాభవనామ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు పరాభవాన్ని మిగిల్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు.
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు
స్పెషల్ టాస్క్ బ్యూరో/హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): పరాభవనామ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు పరాభవాన్ని మిగిల్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు. మంగళవారం శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్లో రాష్ట్ర అవసరాలు, ప్రజల ప్రాధాన్యతలు విస్మరించి తమకు వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చే రంగాలకే భారీ కేటాయింపులు చేశారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమానికి భారీగా నిధుల కోత పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యారంగాన్ని విస్మరించారని మండిపడ్డారు. ఇంట్రిగ్రేటెడ్ పాఠశాలల పేరుతో పెద్దఎత్తున నిర్మాణాలకు అనుమతులిచ్చి దోచుకునేందుకే వాటికి బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ జిల్లాకు నిధుల కేటాయింపులో మొండిచెయ్యి చూపించారని పేర్కొన్నారు. ‘వ్యవసాయానికి నిధులు తగ్గించారు. మహిళా పథకాలకు కేటాయింపులు లేవు. ఫీజు రీయింబర్స్మెంట్ ఊసే లేదు. ఆర్టీసీని దివాలా తీయించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా మోసం చేసిండ్రు’ అని తాతా మధు విమర్శించారు.
కసరత్తు లేని బడ్జెట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీదేవి
బడ్జెట్‌పై ఏ మాత్రం కసరత్తు చేయకుండా నామమాత్రంగా కేటాయింపులు చేసి అన్ని వర్గాలను అసంతృప్తికి గురిచేసినట్టు ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీదేవి పేర్కొన్నా రు. మంగళవారం మండలిలో ఆమె మాట్లాడుతూ.. విద్యావ్యవస్థను స మూలంగా మార్పు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం, దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో కనీసం సిలబస్ మార్పు చేయాలంటేనే చాలా కసరత్తు చేయాల్సి ఉం టుందని, బోర్డు ఆఫ్ స్టడీస్‌లో చర్చ చేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటే, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుచేయాల్సి ఉంటుందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

