ఖమ్మం, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎన్నికల హామీ మేరకు కాం గ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల వడ్లకు రూ.500 చొప్పున బోనస్ చెల్లిం చాలని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రకటించిన 420 హామీల్లో పేర్కొన్న విధంగా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గత నెల 21న సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన విధంగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వకుండా కేవలం సన్న రకానికే బోనస్ చెల్లించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి వెల్లడించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.