కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, ఉమ్మడి ఖమ్మం జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
- ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నరు
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాలు గెల్చుకుంటాం
- బీఆర్ఎస్ రాష్ట్ర నేత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు
ఖమ్మం, మే 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, ఉమ్మడి ఖమ్మం జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలిచిన తెలంగాణ రాష్ర్టాన్ని అధోగతి పాలుజేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్, కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని సబ్బండ వర్గాలు కోరుకుంటున్నాయని తెలిపారు. ఈ దఫా పదికి పది అసెంబ్లీ స్థానాలను గెలువాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

