కార్యకర్తలే బీఆర్ఎస్కు శ్రీరామరక్ష
కార్యకర్తలే బీఆర్ఎస్కు శ్రీరామరక్ష అని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు.
- కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టాలి
- ప్రతి గ్రామంలో భారీ సంఖ్యలో సభ్యత్వాలు నమోదు కావాలి
- వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
- పాలేరు నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు
ఖమ్మం, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కార్యకర్తలే బీఆర్ఎస్కు శ్రీరామరక్ష అని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు అంశంపై పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అధ్యక్షతన ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన పాలేరు నియోజకవర్గ సమన్వయకమిటీ సభ్యుల సమావేశంలో రవీందర్రావు మాట్లాడారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక చర్యల వల్ల అన్ని వర్గాల ప్రజలు విసుగుచెందారని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేండ్లలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశారని గుర్తుచేశారు. ఆ విజయాలను క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ప్రచారం చేయాలని సూచించారు. సభ్యత్వ నమోదును ప్రతి గ్రామంలో డిజిటల్ పద్ధతిలో చేయాలని తెలిపారు.
ప్రతి బూత్కూ ఇద్దరు కార్యకర్తలను నియమించి సభ్యత్వ నమోదును నిర్వహించాలని సూచించారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్, కేసీఆర్‌కు బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

