మహబూబాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా సర్పంచులు, వార్డుసభ్యుల రిజర్వేషన్లలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్రావు ఆరోపించారు. సోమవారం మహబూబాబాద్ ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
జిల్లావ్యాప్తంగా 482 సర్పంచ్ స్థానాలకు 24 మాత్రమే రావడం అంటే ఐదు శాతం మాత్రమే బీసీలకు దకినట్టని చెప్పారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామన్న సీఎం మాటలు నీటి మూటలుగా మారాయని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లాలో కలెక్టర్ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించకపోవడంవెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు.