హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పరిపాలనా రిమోట్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చేతిలో ఉన్నదని, దీంతో రేవంత్‌రెడ్డి డమ్మీ సీఎం అన్న విషయం ఆ పార్టీ లీడర్‌కు, క్యాడర్‌కు ఎప్పుడో తెలిసిపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దశాబ్దాలపాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ ధ్వజమెత్తారు. ఒకవైపు తెలంగాణలో మీనాక్షి నటరాజన్ డైరెక్షన్లో పరిపాలన నడుస్తుంటే, మరోవైపు ఢిల్లీలో తనకేదో పరపతి పెరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఓవరాక్షన్ చేస్తున్నారని దుయ్యబట్టారు. మీనాక్షి నటరాజన్ ద్వారా తెలంగాణను ఢిల్లీ కాంగ్రెస్ పాలిస్తున్నదని తెలిపారు.