MLC Sripla Reddy : పదో తరగతి పరీక్ష తేదీల మధ్య అంతరాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి (MLC Sripla Reddy) కోరారు. పరీక్ష షెడ్యూల్‌పై విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి వస్తున్న అభ్యంతరాలను శనివారం సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. వినతి పత్రం సమర్పించారు. 10 వ తరగతి పరీక్షల్లో.. ఒకటి ముగిశాక మరొక పరిక్షకు మధ్య 5 రోజుల వ్యవధి ఉందని, ఈ అంతరాన్ని తగ్గించాలని సీఎంకు శ్రీపాల్ రెడ్డి విన్నవించారు.
టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్ ప్రకారం.. ఒక్కొక్క పరీక్షకు మధ్య వ్యవధి 5 రోజుల ఉండడం వల్ల పరీక్షలు పూర్తి కావడానికి నెల రోజులు పడుతుంది. నెలంతా పరీక్షలు జరగడాన్ని విద్యార్థులు అధిక భారంగా భావిస్తున్నారు. దయచేసి.. రోజుల వ్యవధి తగ్గించండి అని ముఖ్యమంత్రిని శ్రీపాల్ రెడ్డి కోరారు. ఎమ్మెల్సీ వినతిని స్వీకరించిన సీఎం పదో పరీక్ష తేదీల అంశాన్ని పరిశీలించాలని తన కార్యదర్శి అజిత్ రెడ్డిని ఆదేశించారు. సీఎంను కలిసిన వాళ్లలో PRTU TS రాష్ట్ర సంఘ అధ్యక్షులు పులగం దామోదర్ రెడ్డి, ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు