గుమ్మడిదల, జనవరి 22 : కాం గ్రెస్ కార్యకర్తలు, నాయకులకే ప్రభు త్వ సంక్షేమ పథకాలు మంజూరవుతున్నాయని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆరోపించారు.
సంగారెడ్డి జి ల్లా గుమ్మడిదలలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి, జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయని తెలిపారు.