కురవి, డిసెంబర్ 8 : మహబూబాబాద్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ప్రొటోకాల్ పాటించకుండా ప్రజా ప్రతినిధులను అవమానించడమే ప్రజాపాలన ఉద్దేశమా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ మండిపడ్డారు. ఆదివారం ఆమె మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని పెద్దతండాలో మీడియాతో మాట్లాడారు.
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్సీగా తనను ఆహ్వానించకపోవడం విచారకరమన్నారు. ప్రొటోకాల్‌ను పాటించని వారిపై మండలి చైర్మన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని తెలిపారు.