మహబూబాబాద్, నవంబరు 12(నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సొంత నియోజకవర్గ కొడంగల్‌లోని లెగచెర్లలో గిరిజనులపై పోలీసులు దాడులు చేయడం అమానుషమని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్(Sathyavathi Rathod )అన్నారు. మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో 13వేల ఎకరాల భూమి ఉండగా, ఇక్కడ కాదని కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మా కంపెనీ తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి ఎందుకు ఆరాటపడుతున్నారని ఆమె ప్రశ్నించారు.
పచ్చని పొలాల మధ్య ఫ్యాక్టరీ పెట్టడం వల్ల పొల్యూషన్‌తో చుట్టుపక్క గ్రామాల ప్రజలకు ఇబ్బంది వాటిల్లుతుందని నిన్న అధికారులు పోతే రైతులు అడ్డగించారన్నారు. రైతుల బాధలను అర్థం చేసుకోకుండా అర్ధరాత్రి పోలీసులు వేల సంఖ్యలో వెళ్లి గిరిజనులను అరెస్టు చేసి కొట్టడాన్ని కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తు న్నాం. నీ సొంత నియోజకవర్గంలోనే రైతులను మెప్పించలేని రేవంత్ రెడ్డి రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలను ఎలా మెప్పిస్తారని ఆమె సూటిగా ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న పాపమా అని నిలదీశారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న సీఎం రేవంత్‌పైనే కేసులు పెట్టాలన్నారు.
రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత 11 నెలల కాలంలో ఇప్పటికీ 25 సార్లు ఢిల్లీ వెళ్లారని, ఆరోపించారు. ప్రజల సమస్యలు పక్కకు పెట్టి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చెక్కర్లు కొట్టడమే సరిపోతుందని విమర్శించారు. ఇప్పటికైనా లగచర్లలోని గిరిజన రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసి వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు.