మహబూబాబాద్ : పండిన పంటను అంత కొంటాం, క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తమని నాడు చెప్పిన కాంగ్రెస్(Congress party) నేడు సన్న వడ్లకు బోనస్ అని మాట మార్చిందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు (MLC Ravinder Rao)విమర్శించారు. మహబూబాబాద్ క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతు భరోసా ఎగ్గొట్టి, 2 లక్షల రుణమాఫీ పేరుతో రైతులను మోసం(Cheating armers) చేసిన గొప్ప పార్టీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. రేషన్ కార్డు పేరుతో అనేక డ్రామలడుతున్నారు.
వరదల వల్ల నష్టపోయిన మహబూబాబాద్ జిల్లా ప్రజలకు ఇంత వరకు ఏమీ చేయలేని అసమర్థ ప్రభుత్వం అని ఘాటుగా విమర్శించారు. తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడుతున్నది. మూసీ మాటలు, హైడ్రా చర్యలు, సియోల్ పర్యటనలు ఇలా ఎన్నో రకాల అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను భయ భ్రాంతు లకు గురి చేస్తుందని మండిపడ్డారు. గ్రామాల్లో అభివృద్ధి, ఆరోగ్యం పడకేసింది. విద్య వ్యవస్థను గందరగోళంగా తయారు చేశారని పేర్కొన్నారు. అవినీతి అధికారులను, గిరిజనులను పిక్కతేనే అధికారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.