హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంబేద్కర్ కొ టేషన్లను గొప్పగా చెప్పిం దే తప్ప, ఆయనను గౌరవించే సంస్కృతి మాత్రం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పో చంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం శాసనమండలిలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో పోచంపల్లి మా ట్లాడుతూ.. సీఎం రేవంత్‌కు అంబేదర్ అంటే సిన్సియారిటీగానీ, సెన్సిబిలిటీగానీ లేదని విమర్శించారు. దేశంలోనే సమున్నతంగా ఏర్పాటుచేసిన 125 అడుగుల అంబేదర్ విగ్రహానికి రెండేండ్లుగా సంకెళ్లు వేయడం ఏమిటని ప్రశ్నించారు. ఏప్రిల్ 14న జరిగే అంబేదర్ జయంతి నాటికైనా సంకెళ్ల నుంచి విముక్తి కల్పించి, గౌరవించాలని హితవు చెప్పారు. గాంధీజీ పేరును బద్నాం చేస్తూ, గాంధీ సరోవర్ పేరుతో కనీస మానవత్వం లేకుండా పేదల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేయడం పై గాంధీ మునిమనుమడు స్పం దించారు కానీ, నెహ్రూ మునిమనుమడు మాత్రం మౌ నంగా ఉన్నాడని ఎద్దేవా చేశారు. ‘ఇకడ జరుగుతున్న ఈ దారుణాలు ఢిల్లీలో కూర్చొన్న కాంగ్రె స్ అధిష్ఠానానికి తెలియ వా? ఎందుకు నోరు మెదప డం లేదు? ఈ విధ్వంసాన్ని ఎందుకు ఆపడం లేదు?’ అని ప్రశ్నించారు. పేదల ఇండ్లను కూల్చడాన్ని తుషార్‌గాంధీ వ్యతిరేకించారు కానీ, రాహుల్‌గాంధీ నుంచి మాత్రం స్పందన కరువైందని విమర్శించారు. కమీషన్ల కోసం.. ఢిల్లీ పెద్దలు కండ్లు, చెవులు మూసుకున్నారని, నోళ్లు కుట్టేసుకున్నారని దుయ్యబట్టారు. రాహుల్ ఇకనైనా మౌనం వీడి మూసీ పరిసరాల్లో పేదల ఇండ్ల కూల్చివేతలను ఆపాలని పోచంపల్లి డిమాండ్ చేశారు.