హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే పీఆర్టీయూ టీఎస్ తరఫున ఉధృతమైన ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జూన్ 2న జరుగబోయే రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా ప్రభుత్వం వేతన సవరణ ప్రకటన, హెల్త్‌కార్డులు, రూ.కోటి ప్రమాద బీమా పథకాలను అమలుపరు స్తూ అధికారికంగా ప్రకటించాలని డి మాండ్ చేశారు. అలా ప్రకటించని పక్షం లో ఉద్యోగుల పోరుబాట తప్పదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఆ సంఘ కా ర్యాలయంలో గురువారం నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో శ్రీపాల్‌రెడ్డి మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ తమ మ్యానిఫెస్టోలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నో హామీలు పొందుపరిచిందని, కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా అమలుకు నోచకపోవడం శోచనీయమని విమర్శించారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ సమావేశంలో వేతన సవరణ, హెల్త్ కార్డులను జూన్ 2 నుంచి అమలు చేస్తామని మాట ఇచ్చారని గుర్తుచేశారు.
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను 100 రోజుల్లో చెల్లిస్తామని హామీని సీఎం నిలబెట్టుకోవాలని డి మాండ్ చేశారు. సమావేశంలో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్లం దామోదర్‌రెడ్డి, సంఘం ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు పీ వెంకట్‌రెడ్డి, జీ లక్ష్మణ్, ఆడిట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, జగన్మోహన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.