సిటీబ్యూరో, జూలై 30(నమస్తే తెలంగాణ): రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గురువారం ఉదయం నుంచి హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలకు వరద ప్రారంభమైంది. ప్రస్తుతం హిమాయత్‌సాగర్ జలాశయానికి 400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది.
జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1760.80 అడుగుల నీరు నిల్వ ఉన్నది. ఉస్మాన్ సాగర్ జలాశయానికి 150 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1783.35 అడుగుల నీరుంది. ప్రస్తుతానికి రెండు జలాశయాల గేట్లను ఎత్తలేదు. జలమండలి అధికారులు నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.