కొల్లాపూర్, జూలై 30 : ఎగువ ప్రాజెక్టుల నుంచి లక్షల క్యూసెక్కుల నీళ్లు జ లాశయాకి వస్తుంటే ఎంజీకేఎల్ నుంచి 1600 క్యూసెక్కుల నీళ్ల కంటే ఎక్కువ డ్రా చేయలేని స్థితి నెలకొన్నది. పేరు ప్రతిష్టలను, ఈగోను పక్కన పెట్టి వెంటనే పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు బాహుబలి పంప్‌లను ఆన్ చేయాలని పాలమూరు రైతాంగం డిమాండ్ చేస్తోంది. వరద వస్తున్నప్పుడు ఒడి సి పట్టుకోకపోతే వరద ఉధృతి పెరిగిన త ర్వాత ఆంధ్రా ప్రాజెక్టు పోతిరెడ్డిపాడు హె డ్ రెగ్యులేటరీ గురుత్వాకర్షణ ద్వారా రోజుకు 50 వేల క్యూసెక్కుల వరద జలాలను తరలించుకుకొని పోయే ప్రమాదం ఉందని సాగునీటి నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత వా రం రోజుల నుంచి నికరంగా ఎ గువ ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయంలోకి వరద నీళ్లు వ చ్చి చేరుతుండడంతో నదినీళ్లను ఎత్తిపోసేది ఎప్పుడు అని పాలమూరు రైతాంగం ప్రశ్నిస్తుంది.
శ్రీశైలం జలాశయంకు ప్రస్తుత లెక్కల ప్రకారం 837 అడుగుల వరకు వరద జలాలు వచ్చినట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని ఆల్మ ట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయడం వల్ల జూరాల మీదుగా శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతోంది. వరద ఇలాగే కొనసాగితే భారీ స్థాయిలో పూర్తి స్థాయి నీటి మట్టమైనా 885 అడుగులకు తక్కువ రోజుల్లోనే చేరుకు నే అవకాశం ఉన్నది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టంతో కొనసాగితే కృష్ణానదిపై ఉన్న పాలమూరు ప్రాజెక్టుల ద్వారా సాగునీటికి ఢోకా ఉండదు. తెలంగాణలో ఎల్‌నినో ఎఫెక్ట్ స్పష్టంగా కనబడిన ఎగువ ప్రాజెక్టులపై కురుస్తున్న వర్షాలతో శ్రీశైలానికి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. దీంతో వచ్చే వర ద జలాలను ఒడిసిపట్టుకుంటే ఎల్‌నినో నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నది.
సమాఖ్య పాలకుల మోసానికి బలైన తొలి ప్రాజెక్టు ఎంజీకేఎల్ఐ అని తెలంగాణ వాదు ల వాదనకు బలం చేకూర్చేంచే విధంగా ప్ర స్తుత పరిస్థితి అద్దం పడుతున్నది. గురుత్వాకర్షణ ద్వారా రోజుకు 4 టీఎంసీలకు పైగా గేట్లు ఎత్తితే శ్రీశైలం జలాశయం ఖాళీ అయ్యే విధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నిర్మాణం జరిగితే, రోజుకు 800 క్యూసెక్కుల సామర్థ్యంతో ఎంజీకేఎల్ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. 30 వాట్స్ సామర్థ్యం ఉన్న ఎంజీకేఎల్ఐ లిఫ్ట్-1లోని ఐదు మోటర్లను ఏకధాటిగా 24 గంటల పాటు కృష్ణానది నీళ్లను ఎత్తిపోసిన 0.30 టీఎంసీలను దాటడం లేదు. సమాఖ్య పాలకుల మోసానికి పరాకాష్ట చేరి న విధంగా కాల్వల సామర్థాన్ని కూడా కుదించారు. దీంతో 4వేల క్యూసెక్కులను డ్రా చేస్తే ఎంజీకేఎల్ఐ కాల్వలు తెగిపోతాయి. అం దుకే పేరుకు మాత్రం ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు ఉన్నది కానీ 2వేల క్యూసెక్కుల నీటి ప్రవాహంలోపు మాత్రమే డ్రా చేసేందుకు అవకాశం ఉన్నది.
సాగునీటి విషయంలో పాలమూరుకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకు శ్రీశై లం జలాశయం డెడ్ స్టోరేజ్ అయినా కోతి గుండు నుంచి కృష్ణానది నీళ్లను తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన వెంటనే పీఆర్ఎల్ఐ ప్రాజెక్టుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ప్రపంచంలోనే అత్యంత సామర్థ్యం కలిగిన భారీ బాహుబలి మోటర్లను పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో వినియోగించారు. 145 మెగా వాట్స్ సామర్థ్యం కలిగిన పంప్‌లతో లిఫ్ట్-1 నుంచి రోజుకు 2 టీఎంసీలకుపైగా కృష్ణానది నీళ్లను అంజనగిరి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసే విధంగా డిజైన్ చేశారు.
అంతేకాదు ప్రపంచంలోని సాగునీటి లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ చూసే రాష్ర్టాలు అన్ని తెలంగాణ వైపు చూస్తుండగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ లిఫ్ట్-1లోని మొదటి పంప్‌ను ఆన్ చేసి రెండు టీఎంసీల కృష్ణానది నీళ్లను అంజనగిరి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు నుంచి ఎంజీకేఎల్ఐ కింద వున్న ఎల్లూరూ, సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లకు నీళ్లను అందించేంచే విధంగా గత ప్రభుత్వం స్లూయిస్‌ను ఏర్పా టు చేసింది. ప్రభుత్వం మారిన తర్వాత పీఆర్ఎల్ఐ పంప్‌లను ఆన్ చేయలేదు.
గత ప్రభుత్వ హయాంలోనే నాలుగు బాహుబలి మోటర్ల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రస్తుత ఎల్‌నినో నుంచి తప్పించుకోవాలంటే రిజర్వాయర్లు అన్ని నిండుగా ఉన్నప్పుడే సాధ్యమవుతోందని వెంటనే పీఆర్ఎల్ఐ మోటర్లను ఆన్ చేయాలని రైతులతోపాటు, సాగునీటి నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ఎంజీకేఎల్ ద్వారా నెలల తరబడి లిప్ట్ చేసినా ఆశించిన ఫలితం రాదని, పీఆర్ఎల్ఐలోని లిఫ్ట్-1 సిద్ధంగా ఉన్నా మూడు బాహుబలి మోటర్లను ఆన్ చేసి అంజనగిరి రిజర్వాయర్‌లోకి నీళ్లను ఎత్తిపోయాలని, అక్కడి నుంచి ఎంజీకేఎల్ఐ పరిధిలోని అన్ని రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ శ్రీశైలం జలాశయంలోని కృష్ణానది నీళ్లను ఖాళీ చేయకముందే పాలమూరు-రంగారెడ్డి పంప్‌లను ఆన్ చేయాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.