హుజురాబాద్ : దళితుల సమస్యలను అర్థం చేసుకున్నది సీఎం కేసీఆరేనని, దళితబంధు పథకం ద్వారా భారతదేశ దళితుల బతుకులు బాగుపడతాయని, అటువంటి బృహత్తర పథకానికి కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. దళిత బంధు పథకాన్ని ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ శాలపల్లిలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అందుకు అంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి పరిశీలిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులను ఓటుబ్యాంక్ గా కాకుండా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకున్నది సీఎం కేసీఆరే అని ఆయన పేర్కొన్నారు. రెండు పంటలకు రైతు బంధు పథకం ద్వారా పదివేల రూపాయలు అందిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన వెల్లడించారు. ఈ పథకాన్ని యునెస్కోతోపాటు దేశం యావత్తు ప్రసంశిస్తున్నదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు.