హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : టెట్ పరీక్ష విధానంపై సమీక్షించాలని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సహాయ మంత్రి జయంత్ చౌదరికి ఆయన వినతిపత్రం అందజేశారు. ప్రస్తుత టెట్ పరీక్ష విధానం ఉపాధ్యాయుల సబ్జెక్ట్ నైపుణ్యాన్ని అంచనా వేసేలా లేదని పేర్కొన్నారు. దీంతో అభ్యర్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.