హైదరాబాద్, జూలై17 (నమస్తే తెలంగాణ): ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026 పోటీల్లో సర్ణపతకాన్ని సాధించిన క్రీడాకారిణి, గురుకుల విద్యార్థిని నారిమల్ల ప్రవళికను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అభినందించారు. ప్రవళికతోపాటు కోచ్ పస్పుల పరశురాముడు, తల్లిదండ్రులను అభినందించారు.