హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : డిప్లొమా పూర్తిచేసిన వారికి ఈవినింగ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు కల్పించేందుకు నిర్వహించే టీజీ ఈసెట్ (వర్కింగ్ ప్రొఫెషనల్స్) షెడ్యూల్లో అధికారులు మార్పులు చేశారు. ఈ ఎంట్రెన్స్ దరఖాస్తుల గడువును పొడిగించారు. శనివారంతో గడువు ముగియనుండగా గడువును ఆగస్టు 14 వరకు పొడిగించారు.