హైదరాబాద్, జూన్ 21 (నమస్తేతెలంగాణ): హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌పై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. ప్రజాసమస్యలపై నిత్యం ప్రశ్నిస్తుండటాన్ని సహించలేకే రేవంత్ సర్కారు నిర్బంధకాండకు దిగుతున్నదని మండిపడ్డారు. అడుగడుగునా నిలదీయడాన్ని సహించలేకే దుర్మార్గాలకు ఒడిగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు, ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక అణచివేత చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికుట్రలు చేసినా, అక్రమ కేసులు బనా యించినా తలవంచబోమని తేల్చిచెప్పారు. నిత్యం ప్రజాక్షేత్రంలో సర్కారు దమననీతిని ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు.
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నందునే రేవంత్ సర్కారు కౌశిక్‌రెడ్డిని నిర్బంధించిందని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను ఖండించారు. ప్రభుత్వం ఇప్పటికే కౌశిక్‌రెడ్డిపై అనేక అక్రమ కేసులు బనాయించిందని పేర్కొన్నారు. కోర్టుకు వెళ్లకుండా శని, ఆది వారాల్లో అరెస్ట్ చేసి రాక్షసానందం పొందుతున్నదని మండిపడ్డారు. అక్రమ నిర్బంధాలను న్యాయస్థానాల ద్వారా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కేసులు, అణచివేతలకు బీఆర్ఎస్ భయపడబోదని హెచ్చరించారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. హామీల అమలు చేతగాక అక్రమ అరెస్ట్‌లకు దిగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు. కృష్ణుడు కూడా శిశుపాలుడి వంద తప్పులను భరించారు.. అదే తరహాలో వరుసగా తప్పులు చేస్తున్న రేవంత్ ప్రభుత్వాన్ని ప్రజలు భరించేందుకు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. శిక్షించేందుకు ఎదురుచూస్తున్నారని తేల్చిచెప్పారు.
పాలనను గాలికొదిలి, రాజకీయ కక్ష సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ స ర్కారు ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగానే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసిందని శనివారం ఎక్స్ వేదికగా ఖండించారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి, ఆనాటి ఎమర్జెన్సీని తలపించేలా పాలన సాగిస్తున్నరు. అక్రమ కేసులు, నిర్బంధా లు బీఆర్ఎస్ శ్రేణుల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయబోవని స్పష్టం చేశారు. శుక్రవారం అరెస్టులు చేయవద్దని కోర్టులు చెప్పినా ప్రభుత్వం వినడం లేదని మండిపడ్డారు. కౌశిక్‌రెడ్డిపై పగబట్టి ఫాల్తు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కౌశిక్‌రెడ్డి ఎవరినైనా మోసం చేశారా? మర్డర్ చేశారా? ఎందుకు అరెస్టు చేశారం టూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజల పక్షాన కౌశిక్‌రెడ్డి పోరాటం చేశారని, అది నచ్చక అయనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు.