ఖైరతాబాద్, నవంబర్ 11: ఫుడ్‌పాయిజన్‌కు గురై తీవ్రమైన శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న ఓ విద్యార్థినికి నిమ్స్ వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. కుమ్రంభీం ఆసీఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న మహాలక్ష్మి, కే జ్యోతి, సీ శైలజ ఫుడ్‌పాయిజన్‌కు గురికావడంతో ఈ నెల 3న నిమ్స్ దవాఖాన లో చేర్చారు.
వీరిలో మహాలక్ష్మి కోలుకోగా, జ్యోతికి పలుమార్లు డయాలసిస్ చేశారు. ప్రస్తుతం కోలుకుంటున్న ఆమెను రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.కానీ.. శైలజ పరిస్థితి రోజుకోవిధంగా మారుతున్నది. ఆమెకు ఊపిరితిత్తుల సమస్యతో పాటు క్రియాటిన్ పెరిగడంతో ఈ నెల 5న ఐసీయూలో చేర్చి చికిత్స అం దిస్తున్నారు. సోమవారం దవాఖానకు వచ్చిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి శైలజ కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిమ్స్‌లో గురుకుల విద్యార్థినులు, వారి కుటుంబసభ్యులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కూడా పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని డైరెక్టర్ డాక్టర్ బీరప్పను ఆదేశించారు.