చర్ల, డిసెంబర్ 1: ఆరు గ్యారెంటీలను విస్మరించి ప్రజలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సమాధి కడదామని ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను రేవంత్ సర్కారు తుంగలో తొక్కిందని విమర్శించారు. బీఆర్ఎస్ మండలం కన్వీనర్ దొడ్డి తాతారావు అధ్యక్షతన చర్లలో ఆదివారం జరిగిన పార్టీ మండలస్థాయి విస్తృతస్థాయి సమావేశంలో తాతా మధు మాట్లాడారు. స్వార్థంతో పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్‌లో చేరిన వారికి పరాభవం తప్పదని స్పష్టం చేశారు. భద్రాచలం నియోజకవర్గానికి కచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందని, అప్పుడు కూడా బీఆర్ఎస్ గెలుపు ఖాయమవుతుందని స్పష్టం చేశారు. ప్రజలు కూడా బీఆర్ఎస్ని గెలిపించి.. పార్టీ మారిని వారికి, చేర్చుకున్న వారికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ.. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం పార్టీ శ్రేణులు శ్రమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నేతలు మానే రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్ పాల్గొన్నారు.
లింగాలఘనపురం, డిసెంబర్ 1: కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా గ్రామాల్లో తిరిగితే బీఆర్ఎస్ కార్యకర్తలు తరిమికొట్టడం ఖాయమని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య హెచ్చరించారు. నిజాయితీ ఉంటే స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి ఎన్నికల్లో గెలిచి అభివృద్ధి గురించి మాట్లాడాల ని సవాల్ విసిరారు. జనగామ జిల్లా లింగాలఘనపురంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కడియం తన కూతురు భవిష్యత్ కోసం పార్టీ మా రారాని విమర్శించారు. కాంగ్రెస్‌కు రూ.వంద కోట్లకు అమ్ముడుపోయి, ఆ డబ్బులతోనే కూతురును ఎంపీగా గెలిపించుకున్నారని ఆరోపించారు.