హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తేతెలంగాణ) : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీని కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేస్తారనే ప్రచారంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉంటారని, మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలు ఆ స్థాయిలో అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు.
ప్రభుత్వ అనుమతితో కట్టిన నిర్మాణాలను కూల్చడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని, ప్రజా ఉపయోగకర నిర్మాణాలకు హైడ్రా నుంచి మినహాయింపులివ్వాలని సూచించారు.