హైదరాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ) : చేనేత వస్ర్తాల కేటాయింపులకు ఏకీకృత టెండర్ విధానాన్ని రద్దు చేసి, టీజీఎస్‌సీవో(తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ) ద్వారా నేరుగా కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. కాంట్రాక్ట్ విధానంతో కార్మికులకు తీ రని నష్టం వాటిల్లనున్నందున టెం డర్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకొని, మార్చి 11న ఇచ్చిన జీ వోను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కార్ తీసుకు న్న నిర్ణయాలు కళాకారులు, కార్మికులకు ఎంతో మేలు చేశాయని గుర్తుచేశారు. రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ సంస్థలకు అవసరమయ్యే ఉత్పత్తుల ను ‘టీస్కో’ ద్వారా కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విధానంతో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నే తన్నలకు ఏడాది పొడుగునా ఉపాధి దొరికేదని ప్రస్తావించారు. ఈ క్రమం లో ప్రభుత్వం నిరుడు మార్చి 11న అన్ని శాఖల ద్వారా చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఉత్తర్వు లు జారీ చేసిందని ప్రస్తావించారు.
ప్రస్తుతం విద్యార్థుల యూనిఫామ్ క్లాత్ సరఫరాకు ఓపెన్ టెండర్ విధానాన్ని తీసుకురావడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. ప్రభుత్వం ఒకవైపు టీస్కో ద్వారా కొనుగో లు చేయాలని చెప్పడం.. మరోవైపు టెండర్ విధా నం అమలు నిర్ణయం.. పరస్పర వి రుద్ధంగా ఉన్నాయని దీని వల్ల చేనేతరంగం సంక్షోభంలో కూ రుకుపో యే ప్రమాదమున్నదని తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంట నే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, విద్యార్థుల యూనిఫామ్ తయారీకి సంబంధించి రూ.105 కోట్ల ఆర్డర్లను టీస్కోకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.