హైదరాబాద్, జూన్1 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్స్టంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కి ఆదివారం లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలంలో చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనుల టెండర్లలో కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయని, తెలంగాణ బీసీ కాంట్రాక్టర్లకు నష్టం చేసేలా జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారని కవిత ఆ లేఖలో ఆరోపించారు. ఒక విదేశీ సంస్థకు చెందిన వాహనాలను మాత్రమే ఈ పనుల కోసం వినియోగించేలా నిబంధనలు రూపొందించారని, కానీ ఆ సంస్థకు హైదరాబాద్‌లో రెండు షోరూమ్‌లు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు.
ఆ షోరూమ్‌ల నిర్వాహకులు తెలంగాణ కాంట్రాక్టర్లతో ఎంవోయూ చేసుకునేందుకు ససేమిరా అంటున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు వేర్వేరుగా టెండర్లు పిలిచేవారని, ఇ ప్పుడు తొమ్మిది జోన్లవారీగా మాత్రమే టెండర్లు పిలవడంతో తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం వాటిల్లుతున్నదని పేర్కొన్నా రు. అధికారులు ఒక సంస్థకు, రెండు కాంట్రాక్టు ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చడంతో జీహెచ్ఎంసీపై ఏడాదికి రూ.5.85 కోట్ల అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. టెండర్లను వెంటనే రద్దు చేసి, గతంలో మాదిరిగా వార్డులవారీగా టెండ ర్లు పిలిస్తే 150 మంది స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. మున్సిపల్ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్ అక్రమాలపై దృష్టి సారించాలన్నారు.
జాగృతికి అనుబంధంగా యూపీఎఫ్
తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా యునైటెడ్ ఫూలే ఫ్రంట్ (యూపీఎఫ్) పనిచేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో యూపీఎఫ్ నాయకులతో కవిత సమావేశమయ్యారు. ఆ సంఘం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. యూపీఎఫ్ కన్వీనర్‌గా బొల్లా శివశంకర్, కోఆర్డినేటర్‌గా ఆలకుంట హరి, అడ్వైజర్‌గా గట్టు రామచందర్రావును నియమించారు. వారితోపాటు మరో 50 మందిని కో కన్వీనర్లుగా నియమించారు. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఐక్య పోరాటాలతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టిందని కవిత పేర్కొన్నారు.
బీసీలను ఒక తాటిపైకి తీసుకొస్తాం
బీసీలను ఒకతాటిపైకి తీసుకొచ్చి రిజర్వేషన్లు సాధించి తీరుతామని యూపీఎఫ్ నూతన కన్వీనర్ శివశంకర్ పేర్కొన్నారు. కాగా, యూపీఎఫ్ కో కన్వీనర్లుగా ఆర్వీ మహేందర్, కోల శ్రీనివాస్, నరహరి, విజయేంద్రసాగర్, మల్లేశ్‌గౌడ్, గొరిగే నరసిం హ, గోవర్ధన్‌యాదవ్, గుర్రం శ్రవణ్, టీ నరేశ్‌కుమార్, డీ కుమారస్వామి, ఏతరి మారయ్య, కే ప్రవీణ్, రాచమల్ల బాలకృ ష్ణ, మురళీకృష్ణ, సల్వాచారి, ఫరూక్, కే శ్రీనివాస్, స్రవంత్, రాజు, నాగరాజు, అఖి ల్, పరమేశ్వరి, కే వెంకటేశ్, అశోక్‌రెడ్డి, మాధవ్, మేన గోపీ, జహంగీర్ పాషా, లక్ష్మణ్, నరసింహులు, వీ యాదగిరిరావు, లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, గుంటి మంజుల, గీతగౌడ్, రమాదేవి, నిమ్మల నగేశ్, కృష్ణమాచారి, తారాసింగ్, శైల, పర్వతాలు, కృష్ణ, టీ కలపూర్ణ, శ్రీనివాస్, ఆంజనేయులు, షేక్ లతీఫా, సర్సింహరాజు, గాదె సామయ్య, శివాజీ, చత్రి మంజులసాగర్, జే లలితాజగన్ను నియమించినట్టు కవిత ప్రకటించారు.