సాయంత్రం 5:20 గంటలకు అరెస్ట్
ఎమ్మెల్సీ కవితను శుక్రవారం సాయంత్రం 5:20 గంటలకు అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఐదు గంటలపాటు సోదాలు జరిగాయని, ఈ ప్రక్రియ మొత్తానికి కవిత సంపూర్ణంగా సహకరించారని చెప్పారు. ఈ మేరకు అరెస్ట్ ఆర్డర్, పంచనామా నివేదికల్లో పేర్కొన్నారు.
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కవితను శుక్రవారం సాయంత్రం 5:20 గంటలకు అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఐదు గంటలపాటు సోదాలు జరిగాయని, ఈ ప్రక్రియ మొత్తానికి కవిత సంపూర్ణంగా సహకరించారని చెప్పారు. ఈ మేరకు అరెస్ట్ ఆర్డర్, పంచనామా నివేదికల్లో పేర్కొన్నారు. వీటి ప్రకారం.. ఈడీ అధికారులు కవితకు ఈ నెల 14 ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)లోని సెక్షన్ 17 కింద నోటీసులు జారీచేశారు. ఆ మేరకు శుక్రవారం మధ్యా హ్నం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని ఆమె నివాసానికి వచ్చారు. అధికారులు తమను పరిచయం చేసుకొని, సెర్చ్ వారంట్‌ను చూపించారు. ఎందుకు సోదాలు చేయాలనుకుంటున్నారో వివరించారు. సోదాలు చేసేముందు.. కావాలనుకుంటే తమను చెక్ చేసుకోవచ్చని అధికారులు చెప్పగా.. కవిత సున్నితంగా తిరస్కరించారు. అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ జోగెందర్ ఆధ్వర్యంలో ఇంట్లో సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమైన సోదాలు సాయంత్రం 6:45 గంటలకు ముగిశాయి. ఈ క్రమంలో కవిత స్టేట్మెంట్ను సైతం వారు రికార్డ్ చేసుకున్నారు.
ఈసం దర్భంగా ఐదు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం 5:20 గంటలకు కవితను అరెస్ట్ చేశారు. అరెస్ట్ ఆర్డర్‌ను ఆమెకు అందించారు. పీఎంఎల్ఏలోని సెక్షన్ 3, సెక్షన్ 4 ప్రకారం అరెస్ట్ చేయడానికి తగిన కారణాలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. అరెస్ట్‌కు సంబంధించి కవిత భర్త డీఆర్ అనిల్‌కుమార్‌కు సమాచారం ఇచ్చినట్టు ‘ఇంటిమేషన్ ఆఫ్ అరెస్ట్’లో వెల్లడించారు. సాయంత్రం 6 గంటలకు కవిత సోదరుడు (కేటీఆర్), లాయర్లు, ఇతర సభ్యులు 20 మంది అనుమతి లేకుండాలోపలికి వచ్చారని ఆరోపించారు. సోదాలు పూర్తి శాంతియు తంగా సాగాయని, అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని, కొవిడ్ ప్రొటోకాల్ కూడా పాటించామని పంచనామా నివేదికలో పేర్కొన్నారు. ఈ సోదాల్లో ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా, అసిస్టెంట్ డైరెక్టర్లు జోగీందర్, సుమిత్ గోయల్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కార్తీక్ మెహ్రా, హిమాన్షు చౌదరి, మమత నారా, సెపాయ్, బ్రజేశ్ చౌరాసియా, వరలక్ష్మి తుమ్మోజె పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

