సూర్యాపేట, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ ) : ‘సమాజానికి అన్నం పెట్టే రైతుల గోడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అస్సలే పట్టదు. ప్రభుత్వానికి దేనిపైనా ఆలోచన లేదు. ప్రధానంగా జల విధానంపై స్పష్టత లేదు. ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగలడం ఖాయం’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీ పర్యటనలు చేయడంతోనే సీఎం రేవంత్‌రెడ్డి కాలం వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా పెద్దగట్టు లింగమంతులస్వామి జాతరకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. బోనం ఎత్తుకొని గుట్టపైకి ఎక్కి స్వామివారికి పూజలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 14 నెలల పాలనలో 30సార్లు ఢిల్లీకి పోవడం, కాంగ్రెస్ పెద్దల కాళ్లు పట్టుకోవడం, మళ్లీ గల్లీ కొచ్చి కేసీఆర్‌ను తిట్టడం ఇలాగే నడుస్తున్నది గానీ ముఖ్యమంత్రికి ఒక స్పష్టమైన ఆలోచన లేదని దుయ్యబట్టారు. గురుకులాల్లో చనిపోతున్న పిల్లల పట్ల, ఉద్యోగాల నోటిఫికేషన్లపై రేవంత్‌రెడ్డి రివ్యూ చేయకపోవడం దౌర్భగయ్యమని మండిపడ్డారు.
మహిళల కోసం ప్రత్యేకంగా ఒక్క కార్యక్రమం కూడా ఈ 14 నెలల్లో చేయలేదని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500, విద్యార్థినులు, యువతులకు స్కూటీలు ఇచ్చారా? అని నిలదీశారు. మహిళలకు ఏం చేశారో ప్రభుత్వ పెద్దలు చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ పాలనలో ఏది చేసినా మహిళల పేర చేశామని, డబుల్ బెడ్రూం ఇండ్లు, పింఛన్లు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి ఏదైనా సరే ముందు ఆడబిడ్డలను పెట్టుకుని ఎంతో బాగా చూసుకున్నామని గుర్తుచేశారు. నాడు ఎవరైనా నేరాలు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేలా కేసీఆర్ పరిపాలన అందించారని తెలిపారు. ఈ 14 నెలల్లో 20% క్రైంరేట్ పెరిగిందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఉట్టిగా రాలేదని, పేగులు తెగేదాకా కొట్లాడితే వచ్చిందని గుర్తుచేశారు. తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని కాపాడుకోలేకపోతే ఎందుకు అధికారంలో ఉన్నట్టు? ఎవరి కోసం ఉన్నట్టు? మీ ప్రాధాన్యం ఏమిటో చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘ఎస్టీల కోసం ఏమైనా చేశారా? ఎస్సీ, బీసీ జనాభాను తక్కువ చేసి చూపిస్తున్నారు. ఎవరి కోసం పని చేస్తున్నారు? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గోదావరి జలాలను ప్రతి గ్రామంలో పారించిన ఘనత కేసీఆర్‌ది అని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక జల విధానం, ఆలోచన లేదని ఎమెల్సీ కవిత విమర్శించా రు. తెలంగాణకు నీళ్లు మలపాలనే ఒక విధా నం లేని సీఎం రేవంత్.. మేడిగడ్డను వాడకుండా పంటలను ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ 199 టీఎంసీలతో బనకచర్లలో కొత్త ప్రాజెక్టు కడుతామని మోదీతో పైరవీలు చేస్తుంటే, మన సీఎం కనీసం ఇప్పటివరకు నాగార్జునసాగర్‌ను కూడా రాష్ట్ర పరిధిలోకి తేలేదని దు య్యబట్టారు. ‘నాగార్జునసాగర్, కాళేశ్వరం నీళ్లు రాకుంటే మన పరిస్థితి ఏమైతది? తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఎవరి కోసం? దీనికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి. సూ ర్యాపేట జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే ఆ పాపం, ఆ ఉసురు ఉత్తమ్‌కు త గులుతుంది’ అని పేర్కొన్నారు. నీళ్లపై శ్రద్ధ లేని ఇరిగేషన్ మంత్రి పదవిలో ఉన్నా ఒక టే, లేకున్నా ఒకటేనని ప్రజలు ఆలోచిస్తున్నారని తెలిపారు. రేవంత్ టీవీలో కనిపిస్తే ప్రజలు చానల్ బంద్ పెట్టే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, రాష్ట్ర నాయకుడు సోమ భరత్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు గా దరి కిశోర్‌కుమార్, బొల్లం మల్లయ్యయాద వ్, నోముల భగత్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, చంద్రవతి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, దావు ల వీరప్రసాద్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, గండూరి కృపాకర్, రంగినేని ఉపేందర్, బాలసైదులు పాల్గొన్నారు.
ఆడబిడ్డ తెలంగాణలో బాగున్నా.. భద్రంగా ఉన్నా.. అనే చెప్పుకొనే పరిస్థితి ఉన్నదా? నెలకో మతకల్లోలం అవుతున్నది. ఇలాంటి వాటితో ప్రపంచ రికార్డు సాదిద్ధామని అనుకుంటున్నారా?
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కులగణన రీ సర్వేపై ప్రజ ల్లో అవగాహన కల్పించడంలో కాంగ్రెస్ ప్రభు త్వం విఫలమైందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అందుకే తొలిరోజైన మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కేవలం 43 మంది నుంచే అభ్యర్థనలు వచ్చాయ ని ఎక్స్ వేదికగా గుర్తుచేశారు. తెలంగాణ ప్రభు త్వం ప్రజలను సంఘటితం చేయడంలో మళ్లీ విఫలమైందనడానికి ఇదో స్పష్టమైన ఉదాహరణ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కారు రీ సర్వేను సీరియస్‌గా తీసుకుంటే ఫలితం ఎందుకు కనిపించడం లేదు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలోనే సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయానికి ప్రాచుర్యం దక్కిందని కవిత ఎక్స్ వేదికగా మరో పోస్టులో పేర్కొన్నారు.
2008లో పెద్దగట్టు ఆలయాన్ని తొలిసారి సందర్శించానని, ఆనాటి ఫొటోను పోస్టుచేశారు. మంగళవారం మరొకసారి పెద్దగట్టు జాతరకు హాజరవుతుండటం సంతోషంగా ఉన్నదని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి కేసీఆర్ విరివిగా నిధులు మంజూరు చేశారని, పాత గుడి స్థానం లో కొత్త గుడిని నిర్మించారని తెలిపారు. మిషన్ భగీరథ పథకం కింద గుట్టపై వరకు పైప్‌లైన్ ఏర్పాటుచేశారని, లక్ష లీటర్ల నీటి సామర్థ్యం గల ట్యాంకును నిర్మించి నీటి సమస్యను శాశ్వతంగా దూరం చేశారు’ అని పేర్కొన్నారు.