హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తానన్న సీఎం ఇంకా తీసుకెళ్లలేదని విమర్శించారు. జూలై 8 లోపు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లోని బీసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలన్నారు. బీసీ బిల్లు విషయంమై బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి లేఖ రాస్తున్నామని చెప్పారు. ఈ నెల 17న బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం జాగృతి ఆధ్వర్యంలో చేపట్టనున్న రైల్ రోను విజయంతం చేయాలన్నారు. రైల్ రోకోకు సంబంధించిన పోస్టర్‌ను హైరదాబాద్‌లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైల్ రోకో కార్యక్రమానికి వివిధ పార్టీల మద్దతు కూడగట్టామన్నారు. బీసీ బిల్లుపై బీజేపీ చొరవ తీసుకోవాలని, ఈ విషయమై ఆ పార్టీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావుకు లేఖ రాశామని చెప్పారు. ఆయన చొరవ తీసుకోని బీజేపీ అధ్యక్ష హోదాలో తొలి విజయం నమోదు చేసుకోవాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వస్తున్నారని విమర్శించారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ బీసీల కోసం పార్లమెంట్లో ఎన్నడూ మాట్లాడలేదని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా బీజేపీపై ఖర్గే ఒత్తిడి తేవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ పాత లెక్కలే చెబుతున్నారని విమర్శించారు. గ్రామ పంచాయతీల వారీగా కులగణన వివరాలు బయట పెట్టాలన్నారు. జూలై 17న రైల్ రోకో నిర్వహించి తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లే ప్రతి రైలును ఆపుతామన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు సాధించేందుకు బీజేపీపై ఒత్తిడి తెస్తామని వెల్లడించారు.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి కనబరుస్తున్నదని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబును ఒక్క మాట కూడా అనలేదని ధ్వజమెత్తారు. కొందరి కాంట్రాక్టుల కోసమే బనకచర్ల ప్రాజెక్టు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని చెప్పారని, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బనకచర్లను ఆపాలని గట్టిగా కొట్లాడాలని చెప్పారు.