హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బోనాల ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కవిత ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు శుక్రవారం చేరుకున్నారు. ఆమెకు భారత జా గృతి ప్రతినిధులు, బీఆర్ఎస్ ఎన్నారైల ప్రతినిధులు స్వాగతం పలికారు. ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి, కండువాలు కప్పారు.
భారత జాగృతి ఆస్ట్రేలియా అధ్యక్షుడు శ్రీకర్‌రెడ్డి అండెం, విజయ్ కొరబోయిన, బీఆర్ఎస్ నాయకులు నాగేందర్‌రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా నలుమూలల నుంచే కాకుండా సిడ్నీ, మెల్బోర్న్ తదితర నగరాల నుంచి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో స్వప్న దోమ, రాజేశ్ అర్సనపల్లి, బీటీఏ అధ్యక్షుడు కిశోర్, విరించి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శనివారం జరుగనున్న బోనాల వేడుకల్లో కవిత, మంత్రులు, ఎంపీలు పాల్గొంటారు.