బీసీలకు కాంగ్రెస్, బీజేపీ తీరని అన్యాయం చేశాయి. నేను చెప్పినవి తప్పయితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ప్రాంతీయ పార్టీల ద్వారా కేసీఆర్, ఎన్టీఆర్ బీసీలకు న్యాయం చేశారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ర్టాల్లోని ప్రభుత్వాలు బీసీలకు పెద్దపీట వేశాయి.
-ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
MLC Kavitha | హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయకపోతే బీసీలంతా ఏకమై తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శుక్రవారం బీసీ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే ఎ న్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇ చ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వే యాల్సిన డెడికేటెడ్ కమిషన్‌ను కావాలనే ఆలస్యంగా నియమించారని ఆరోపించారు. కర్ణాటక, బీహార్ రాష్ర్టాల్లో విఫలమైన అనుభవాలు ఉన్నప్పటికీ, తెలంగాణ జాగృతి ఉద్య మం చేపట్టేవరకు, హైకోర్టు మొట్టికాయలు వే సేంత వరకు ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను నియమించలేదని విమర్శించా రు. బీసీల లెకలను ఒక కమిషన్ తీస్తుంటే, నివేదికను మరో కమిషన్ ఇస్తున్నదని, ఇలా చేస్తే కోర్టుల్లో నిలబడుతుందా? అని ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డి బీసీ వ్యతిరేకి
బీసీ వర్గాల్లో ఉన్న 130 కులాల్లో ఒకో కులానికి ఒకో సమస్య ఉన్నదని కవిత ఆవేదన వ్యక్తంచేశారు. వాటిని పరిష్కరించడానికి ముఖ్యమంత్రికి మనసొప్పడం లేదని దుయ్యబట్టారు. కులవృత్తుల వారికి కేసీఆర్ అమలు చేసిన పథకాలను నిలిపివేయడం దారుణమని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ప్రతి కులం వాళ్లు ఆత్మగౌరవంతో బతికారని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ కొత్త పథకాలను అమలు చేయకపోయినా, కేసీఆర్ అమలు చేసిన పాత పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
సావిత్రీబాయి జయంతిపై దిగొచ్చిన సర్కార్
తెలంగాణ జాగృతి, బీసీ సంఘాల ఉద్యమాల వల్లనే సావిత్రీబాయి ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కవిత పేర్కొన్నారు. సావిత్రీబాయి జయంతి రోజున మహాసభ నిర్వహిస్తున్నామని తెలియగానే అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. మన ఉద్యమాలతో జంగుపట్టిన ప్రభుత్వ రథచక్రాలు కదులుతున్నాయని పేర్కొన్నారు. బీసీలకు మంచి రోజులు వస్తాయని, కులం ఆధారంగా రాజ్యంగ నిర్మాతలు కొన్ని రక్షణలు కల్పించారని వివరించారు. అంబేదర్ కృషి లేకుంటే ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఫలాలు దకకపోతుండేవని గుర్తుచేశారు. అదే సమయంలో బీసీ కులాలకు సైతం రాజ్యాంగంలో రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఆనాడే బీసీలకు రాజ్యంగపరమైన రక్షణ కల్పించి ఉంటే అభివృద్ధిలో భారతదేశం అమెరికాను దాటేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ.. బీసీ వ్యతిరేక పార్టీలు
బీసీలకు లబ్ధి చేకూర్చే కాకా కాలేల్కర్ కమిషన్‌ను తిరస్కరించి నాటి భారత తొలి ప్రధాని నెహ్రూ బీసీ వ్యతిరేకిగా చరిత్రలో నిలిచిపోయారని కవిత ఆరోపించారు. ఇది బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం కాదా? అని ప్రశ్నించారు. మొరార్జీదేశాయ్ నియమించిన మండల్ కమిషన్ నివేదకను ఏండ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ తొకిపెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. 1980లో మండల్ కమిషన్ నివేదిక ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. బీసీల కోసం పనిచేస్తున్న వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టిందని విమర్శించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హయాంలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని అనాడు రాజీవ్‌గాంధీ అన్నారని పేర్కొన్నారు. బీసీల రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందని 2011 కులగణన చేసిన నివేదికను అప్పటి యూపీఏ ప్రభుత్వం బహిర్గతం చేయకుండా ఆపిందని ఆరోపించారు. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా నివేదికను బయటపెట్టకుండా మోసం చేసిందని విమర్శించారు. బీసీ కులగణన చేయబోమని బీజేపీ బహిరంగాగానే ప్రకటించిందని మండిపడ్డారు.
సావిత్రీబాయి ఆడబిడ్డ కాదు.. పులిబిడ్డ
‘సావిత్రీబాయి పూలే ఆడబిడ్డ కాదు.. పులిబిడ్డ. మహిళా విద్యకు ఎంతగానో కృషి చేశారో. ఎంతోమంది మహిళలకు చదువు నేర్పించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సమాజ వికాసం కోసం పని చేశారు. మహిళా విద్యకు ఎంతగానో కృషి చేశారు. సభలో 70 మందికిపైగా బీసీ సంఘాల నేతలు ప్రసంగించారు. కార్యక్రమంలో కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్, సుమిత్రా ఆనంద్తా నోబా, బీఆర్ఎస్ నేతలు రూప్సింగ్, ముఠా జైసింహ, గట్టు రామచందర్‌రావు, క్యామ మల్లేశం, పల్లె రవికుమార్‌గౌడ్, గడ్డం శ్రీనివాస్‌యాదవ్, మఠం భిక్షపతి, కిశోర్‌గౌడ్, ఉపేందర్, జాగృతి నేతలు నవీన్ఆచారి, వరలక్ష్మి మంచాల, అనంతుల ప్రశాంత్, పెంట రాజేశ్, అప్పాల నరేందర్ యాదవ్, పరకాల మనోజ్‌గౌడ్, కిశోర్‌యాదవ్, బీసీ సంఘాల నేతలు బొల్ల శివశంకర్, ఆలకుంట్ల హరి, మహేందర్, గోవర్ధన్‌యాదవ్, నరసింహ, గోప సదానంద్, కోట్ల యాదగిరి, ఎం నరహరి, దుగట్ల నరేశ్, ఇతరి మారయ్య, కుమారస్వామి, గంధాల శ్రీనివాస్‌చారి, రమేశ్ బాబు, జీ హరిప్రసాద్, సురేందర్, విజేందర్సాగర్, శ్రీధర్‌చారి, రవీంద్రనాథ్, కే శ్రీనివాస్, ప్రవీణ్, అఖిల్, హరిదేవ్సింగ్, సురేశ్, మురళీకృష్ణ, వీరన్న, మందు ల శ్రీనివాస్, కే నరసింహరాజు, ప్రవీణ్, పార్వతయ్య, నరసింహ, కడెకేకర్ రాకేశ్, ఆవుల మ హేశ్, ఎంగులూరి శ్రీను, హుస్సేన్, రామచందర్, వాడేపల్లి మాధవ్, శ్యాంసింగ్ లోదే, దా మ శివకుమార్, వేణుమాధవ్, ఎండీ నవీద్, వరలక్ష్మి, స్వప్న, లావణ్యయాదవ్, పద్మాగౌడ్ సూర్యపల్లి పరశురాం, ఏచాల దత్తాత్రేయ, జి ల్లా నరేందర్, డాక్టర్ కీర్తిలతాగౌడ్, వింజమూ రి రాఘవాచారి, సాల్వాచారి, రూపాదేవి, అప్ప సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ ప్రకటించకపోతే మరో ఉద్యమం: స్వామిగౌడ్బండ్లగూడ, జనవరి 3: బీసీలంతా ఏకమై తమ హక్కులను సాధించుకునే సమయం వచ్చిందని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల మహాసభకు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బీఆర్ఎస్ అధ్యక్షుడు రావులకోళ్ల నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక బీసీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ జెండా ఊపి బస్సును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ ఇవ్వకపోతే భవిష్యత్‌లో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
హామీ నెరవేర్చేదాకా కొట్లాడతాం
‘బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు నన్ను ప్రశ్నిస్తున్నారు. సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా.. ఎన్నికలు పూర్తయ్యాక ఎందుకు మాట్లాడలేదని మళ్లీ కాంగ్రెస్ నాయకులే అంటారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేదాకా మాట్లాడుతూనే ఉంటా.. కొట్లాడుతూనే ఉంటా. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సిందే. లేదంటే.. బీసీల జనాభా ఎంత ఉంటే అంత వాటా ఇచ్చి ఎన్నికల్లోకి వెళ్లాలి. దొంగలెకలు, కాకిలెకలు కాకుండా వాస్తవలెకలు తీయాలి’ అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
ఎప్పుడైనా.. ఎక్కడైనా చర్చకు సిద్ధం…
బీఆర్ఎస్ హయాంలో బీసీల అభివృద్ధి, ఏడాది కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధమా? అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ విసిరిన సవాల్‌ను ఎమ్మెల్సీ కవిత స్వీకరించారు. ‘ఎకడైనా.. ఎప్పుడైనా.. ఏ గల్లీలోనైనా.. ఏ సెంటర్‌లోనైనా.. చర్చకు నేను సిద్ధం. కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లలో జరిగిన అభివృద్ధి ఎంత, కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి ఎంత అన్న దానిపై చర్చించడానికి సిద్ధమని ప్రకటించారు.
కాంగ్రెస్, బీజేపీ బీసీలకు తీరని అన్యాయం చేశాయి. నేను చెప్పినవి తప్పయితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ప్రాంతీయ పార్టీల ద్వారా కేసీఆర్, ఎన్టీఆర్ బీసీలకు న్యాయం చేశారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ర్టాల్లోని ప్రభుత్వాలు బీసీలకు పెద్దపీట వేశాయి.
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
మన ఉద్యమాలతో జంగుపట్టిన ప్రభుత్వ రథచక్రాలు కదులుతున్నాయి. బీసీలకు మంచి రోజులొస్తాయి. బీసీ కులాలకు సైతం రాజ్యాంగంలో రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఆనాడే బీసీలకు రాజ్యంగపరమైన రక్షణ కల్పించి ఉంటే అభివృద్ధిలో భారతదేశం అమెరికాను దాటేది.
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత