MLC Kavitha | ఖలీల్‌వాడి, నవంబర్ 22: తెలంగాణ అసెం బ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ అభివృద్ధికి, కాంగ్రెస్ అరాచకానికి మధ్య జరుగుతున్నవని, ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. పోలీసుల పేర్లను రెడ్ డైరీలో రాసుకుంటామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారని, ఆయన బెదిరింపులకు భయపడేవాళ్లు ఇక్కడ ఎవరూ లేరని ఆమె స్పష్టం చేశారు. కానీ.. కాంగ్రెస్ పార్టీ పేరును తెలంగాణ ప్రజలు ఇప్పటికే రెడ్ డైరీలో రాసుకున్నారని, ఈ నెల 30న జరిగే పోలింగ్‌లో ఓటుతో సరైన గుణపాఠం చెప్తారని తెలిపారు.
బోధన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్, కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని కవిత తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. 80 సీట్ల కన్నా ఒక్కటి తక్కువ వచ్చినా ఏదంటే అది చేస్తానని రేవంత్‌రెడ్డి అంటున్నారని, ఇ లాంటి సవాళ్లను 10 సార్లు చేశారని, కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని గత ఎన్నికల్లో అన్నారని గుర్తుచేశారు.
నాడు కాంగ్రెస్ పార్టీ జిల్లాల్లో అల్లర్లను విస్తరిస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలకు ఐటీ రంగాన్ని విస్తరించిందని తెలిపారు. తమ పార్టీ బోధన్ అభ్యర్థి షకీల్‌పై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని, ఈ సందర్భంగా జిల్లాకు వచ్చిన రేవంత్‌రెడ్డి కొంత బాధ్యతగా మాట్లాడుతారని అనుకుం టే.. ఆయన ఉల్టా పోలీసులను విమర్శిస్తున్నారని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలపై భౌతిక దాడికి దిగడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. మొ న్న దుబ్బాక, నిన్న మంథని, బోధన్‌లో కాంగ్రె స్ దాడులు చేసిందని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, మేయర్ దండు నీతూకిరణ్ పాల్గొన్నారు.