హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యూనియన్ నాయకులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ మార్గనిర్దేశకత్వంలో 23 ఏండ్లుగా కార్మికుల పక్షాన నిబద్ధత, చిత్తశుద్ధితో యూనియన్ పోరాడుతున్నదని సోమవారం ఎక్స్ వేదికగా కొనియాడారు.
దేశానికి వెలుగులు పంచే సింగరేణి పరిరక్షణే లక్ష్యంగా బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా పోరాడుతున్నదని చెప్పారు. తెలంగాణ ప్రాంత గోదావరిలోయలోని బొగ్గు గనులన్నింటినీ సింగరేణికి కేటాయించేలా కేంద్రంపై రాష్ట్రప్రభుత్వం ఒత్తిడితేవాలని డిమాండ్ చేశారు.