హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. జన్మదిన శుభాకాంక్షలు బావ.. ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నట్టు కవిత తన ట్వీట్లో పేర్కొన్నారు.
Wishing @trsharish Bava a happy birthday. May you be blessed with good health and a long life pic.twitter.com/MF7d3nH7Tc
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 3, 2022
మంత్రి హరీశ్‌రావు బర్త్‌డే సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. హరీశ్‌రావు అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తన జన్మదినం సందర్భంగా తనపై ఉన్న ప్రేమను ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా చాటాలని అభిమానులు, కార్యకర్తలకు హరీశ్‌రావు సూచించిన సంగతి తెలిసందే.