సంగారెడ్డి : పోలీసు కేసు నుంచి పేరును తొలగించేందుకు బాధితుడి నుంచి ఎస్సై లంచం ( Bribe ) తీసుకుంటూ ఏసీబీకి ( ACB Raid ) అధికారులకు చిక్కాడు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూరు పోలీస్ స్టేషన్ ఎస్సై ఎం రమేశ్ ( SI Ramesh ) శుక్రవారం రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
మొత్తం రూ.30 వేలకు గాను గత డిసెంబర్ నెలలో రూ.5 వేలు తీసుకున్న ఎస్సై శుక్రవారం మరో రూ.20 వేలు తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఎస్సైను హైదరాబాద్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అవినీతి, అక్రమాలకు పాల్పడితే టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.