మెదక్ రూరల్ జనవరి 02 : మెదక్ జిల్లా హవేల్ ఘనపూర్ మండలంలోని డైట్ కళాశాల (DIET College) వద్ద నూతన భవనానికి భూమి పూజ నిర్వహించారు. హాస్టల్ మెస్లకు స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావులు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నాణ్యమైన ఉపాధ్యాయులను తయారుచేసి సమాజానికి అందించాలని అన్నారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, ఉపాధ్యాయ వృత్తి వల్ల సమాజాన్ని మార్చే శక్తి ఉంటుందని ఆయన తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి కల్లా నూతన భవన నిర్మాణం జరిగి తరగతులు మొదలు కావాలని ఎంపీ ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ డైట్ కళాశాల ఉపాధ్యాయలను తయారు చేసే కార్ఖానా కావాలని అన్నారు. రానున్న విద్యా సంవత్సరానికి నూతన భవనాన్ని అందించే ప్రణాళికలు చేశామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి, డైట్ కళాశాల ప్రిన్సిపల్ రాధా కిషన్, హవేలీ ఘన్పూర్ సర్పంచ్ సాయిలు, ఈఈ శ్రీనివాస్ రెడ్డి, డీఈ నరసింహ చారి, సంబంధిత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు