జగిత్యాల టౌన్/జగిత్యాల అర్బన్: జాగృతి జగిత్యాల నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జగిత్యాలలో బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా బతుకమ్మను పేర్చారు. ఆ తరువాత వివేకానంద మినీస్టేడియంలో తోటి మహిళలతో కలిసి ఆడిపాడి సందడి చేశారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత తదితరులు పాల్గొన్నారు.