సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తనయుడు గూడెం విష్ణువర్ధన్‌రెడ్డి ఇటీవల మరణించడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం పటాన్‌చెరులోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి మహిపాల్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యేను కవిత ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విష్ణువర్ధన్‌రెడ్డి యువ నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీకి అందించిన సేవలను కొనియాడారు. మంచి భవిష్యత్తు ఉన్న యువ నాయకుడిని పార్టీ కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. – పటాన్చెరు