MLC Kavitha | న్యూఢిల్లీ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) ఈడీ( ED ) విచారణ ముగిసింది. ఉదయం 11:30 గంటలకు ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన కవిత రాత్రి 8 గంటల సమయంలో బయటకు తిరిగొచ్చారు. దాదాపు 8:30 గంటల పాటు కవితను ఈడీ అధికారులు విచారించారు. విచారణ ముగిసిన అనంతరం తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్ నివాసానికి( KCR House ) కవిత బయల్దేరారు. అయితే ఈడీ ఆఫీసు నుంచి కవిత బయటకు రాగానే ఆమె మద్దతుదారులు జై బీఆర్ఎస్.. జై కేసీఆర్.. జై కవితక్క అంటూ నినదించారు. అయితే ఈ నెల 16న మళ్లీ విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది.