MLC Kavitha | న్యూఢిల్లీ : నేను కేసీఆర్ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. నన్ను అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేశారు అని ఆమె అన్నారు. తీహార్ జైలు నుంచి విడుదలైన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. పిడికిలి బిగించి జై తెలంగాణ నినాదాలు చేశారు ఆమె. భర్త అనిల్, అన్నయ్య కేటీఆర్, కుమారుడిని గుండెలకు హత్తుకుని కవిత భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నోఎత్తుపల్లాలు చేశాను. తన పిల్లలను వదిలి ఐదున్నర నెలలు జైల్లో ఉండడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇలాంటి ఇబ్బందులకు గురిచేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం. సమయం వస్తది.. తప్పకుండా చెల్లిస్తాం. అదే విధంగా ఇలాంటి కష్టసమయంలో మాకు, మా కుటుంబానికి తోడుగా ఉన్నవారికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. నేను తెలంగాణ బిడ్డను.. కేసీఆర్ బిడ్డను. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని.. మంచిదాన్ని. నన్ను అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేశారు. ప్రజాక్షేత్రంలో ఇంకా గట్టిగా పని చేస్తాం. కమిట్మెంట్తో పని చేస్తాం. అందరితో కూడా నిలబడి ఉంటాం. మేం ఎవరికీ భయపడం.. న్యాయపరంగా పోరాడుతూనే ఉంటాం. నన్ను అనవసరంగా జైలుకు పంపారు అని కవిత పేర్కొన్నారు.
నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెళ్ళిస్తాను
నేను మొండిని.. నన్ను జైలుకు పంపించి జగమొండిని చేశారు..
నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను నేను ఏ తప్పు చేయలేదు..
మొత్తం దేశానికి తెలుసు రాజకీయ కక్షలో భాగంగానే నా మీద కేసు పెట్టి నన్ను జైలు పంపించారు…
ఇంకా గట్టిగా… pic.twitter.com/fIAiVKv6vQ
— Telugu Scribe (@TeluguScribe) August 27, 2024