అమీర్‌పేట్/మేడ్చల్, ఫిబ్రవరి 25: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం పరామర్శించారు. అనారోగ్యంతో ఇటీవల అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె చిత్రపటానికి కవిత పుష్పాంజలి ఘటించారు. అనంతరం అల్లం నారాయణను ఓదార్చారు. ఉద్యమ సమయంలో అమ్మల సంఘం అధ్యక్షురాలిగా అల్లం పద్మ చేసిన పోరాటాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకొన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తదితరులు అల్లం పద్మ చిత్ర పటానికి నివాళి అర్పించారు.