సీఎం కేసీఆర్ వెంట నడిచిన గొప్పనాయకుడు: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంపట్ల ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వెంట నడిచిన గొప్పనాయకులన్నారు. నోముల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఉదయం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటనే హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో దవాఖానకు తరలించారు. కాగా, అక్కడ చికిత్స పొందుతూ నోముల మృతి చెందారు.
ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గారి అకాల మరణం వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యాను. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వెంట నడిచిన గొప్ప నాయకులు నోముల నర్సింహయ్య గారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/y6lm4KdxJQ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 1, 2020