హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత భారీ కేక్ కట్‌చేసి ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ భవన్లో జరిగిన సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. కేక్ కట్‌చేసి సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు. దాతల సహకారంతో తయారుచేసిన బంగారు పాదాలు, జడ, కాసులపేరును అమ్మవారికి సమర్పిస్తారు.