సిరికొండ, డిసెంబర్ 27: కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోపాటు హామీలన్నింటినీ అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నర్సింగ్‌పల్లిలో ది లివింగ్ క్రైస్ట్ చర్చిలో బుధవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. కవిత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.2 వేలు పింఛన్ తీసుకున్న 44 లక్షల మందికి ఎలాంటి దరఖాస్తు తీసుకోకుండా వచ్చే జనవరి 1 నుంచి రూ.4 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దరఖాస్తులో నిరుద్యోగ భృతి కాలం ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి నిరుద్యోగికి భృతి ఇవ్వాలని కోరారు. జనవరి నుంచి 200 యూనిట్ల వరకు ఎవరూ కరెంట్ బిల్లు కట్టవద్దని చెప్పారు.