హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : జైలు నుంచి విడుదలయ్యాక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం తొలిసారి స్పం దించారు. ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని మోదీ.. అదానీవైపేనా? అని ప్రశ్నించారు. ‘అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా? అని నిలదీశారు. ‘ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని.. అదానీ వైపేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.